యూపీ హథ్రాస్ లో ఓ కీచక ప్రొఫెసర్ బాగోతం బట్టబయలైంది. ఓ పీజీ కాలేజీ ప్రొఫెసర్ పలువురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం.