బాల్య వివాహాల నిషేధ చట్టం-2006, దేశంలో ప్రతీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతీ భారతీయుడు ముందుగా పౌరుడు, ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది. బాల్యవివాహాలపై పాలక్కాడ్ లో 2012లో నమోదైన కేసును కొట్టేయాలని దాఖలైన పిటిషన్ పై.. హైకోర్టు జస్టిస్ వీవీ కున్నికృష్ణన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.