తమిళనాడుకు చెందిన యువ పాస్టర్ 'జాన్ జెబరాజ్'ను పోక్సో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో కోయంబత్తూరులోని తన ఇంట్లో ప్రార్థనా సమావేశం సందర్భంగా వచ్చిన బాలికలపై జాబ్ జెబరాజ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పాస్టర్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కేరళలోని మున్నార్‌లో ఉన్నట్లు తెలియడంతో తాజాగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.