AP: రాయచోటి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీ ప్రకటించాలని ఓ యువకుడు నినాదాలు చేశాడు. దీంతో అసహనానికి లోనైనా సీఎం యువకుడిపై మండిపడ్డారు. నువ్వు చెబితే ప్రకటించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు అక్కడక్కడా ఉంటారు అని అన్నారు.