నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు సీతక్క, పొంగులేటి కాన్వాయ్‌ను BRS శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వడ్ల కొనుగోళ్లు లేటు అవుతుందంటూ కుంటాల వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగిన BRS కార్యకర్తలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను నిలువరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.