రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కొందరిని అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న డీఎస్పీ స్థాయి మహిళా పోలీసు అధికారిపై నిరసన కారులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రామనాథపురానికి చెందిన 35 ఏళ్ల ట్రక్ డ్రైవర్ కాళికుమార్ అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులను అరెస్టు చేయాలని గ్రామస్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో డీఎస్పీ గాయత్రి, ఇతర పోలీసులు వారిని అడ్డుకోగా, నిరసనకారుల్లో కొందరు ఆమెపై దాడి చేశారు.