పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిరసన కారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు వాహనదారులకు నిప్పుబెట్టారు. ఈ క్రమంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ ముర్షిదాబాద్‌లో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఆందోళన కారులపై ఉక్కుపాదం మోపనున్నట్లు వెల్లడించారు.