మధుమేహానికి మంచి ఔషధంగా సొరకాయ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సొరకాయను రోజూ క్రమం తప్పకుండ తినడం వల్ల డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.సొరకాయ తినడం వల్ల శరీరానికి పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, సోడియం, పీచు, భాస్వరం, జింక్, కాపర్, మాంగనీస్, ఫోలేట్, రిబోఫ్లేవిన్, సెలీనియం, బి6, సి విటమిన్లు అందుతాయని సూచిస్తున్నారు. క్యాన్సర్లను సైతం ఇది నివారిస్తుందని అంటున్నారు.