గుమ్మడి గింజలను తింటే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్లు, ఫ్యాట్స్, ఫైబర్, ఆయొడిన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇంకా థైరాయిడ్ తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.