కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. స్వల్ప స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్‌తో ప్రభుసిమ్రన్ (30), ప్రియాంశ్ ఆర్య (22) శ్రేయస్ అయ్యర్ (0)ను ఔట్ చేయగా నోర్జే, నరైన్ చెరో వికెట్ పడగొట్టి పంజాబ్ ను దెబ్బతీశారు. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్‌వెల్ (7*) సూర్యాంశ్ (1*) ఉండగా 9 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోరు 76/5గా ఉంది.