ప్రముఖ పంజాబీ నటి తానియా తండ్రి, డాక్టర్ అనిల్ జీత్ సింగ్ కాంబోజ్ పై శుక్రవారం తన క్లినిక్ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అనిల్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు వెల్లడించాయి. దాడి చేసిన వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి రోగులుగా నటిస్తూ క్లినిక్ లోపలకి ప్రవేశించారని సమాచారం.