IPL క్రికెటర్లను హైదరాబాద్కు చెందిన బడా బిజినెస్ మ్యాన్ ఫిక్సింగ్లోకి లాగుతున్నట్లు BCCI అనుమానిస్తోంది. దీంతో IPL టీమ్స్ ఫ్రాంచైజీ ఓనర్లతో పాటు క్రికెటర్లు, కోచింగ్ టీం, కామెంటేటర్లకు అలర్ట్ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్లేయర్లను ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. ప్లేయర్లకు ఖరీదైన గిఫ్ట్స్, జ్యువెలరీ ఆఫర్ చేస్తున్నారట. ఫిక్సింగ్ కోసం IPL టీమ్స్ బస చేసే హోటల్స్కు వెళ్లి అక్కడ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.