తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన విజయ డెయిరీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు TTD కార్యనిర్వహణ అధికారి శ్యామలరావుకు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ లేఖ ద్వారా ప్రభుత్వ ప్రతిపాదన తెలియజేశారు. దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందని తెలిపారు.