పుష్కరాలు ప్రారంభం.. ఘనంగా ఏర్పాట్లు

73చూసినవారు
పుష్కరాలు ప్రారంభం.. ఘనంగా ఏర్పాట్లు
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సరస్వతి ఘాట్‌లో ప్రతిరోజు సాయంత్రం 6:45-7:35 గంటల మధ్య సరస్వతి నవరత్న మాల హారతి, కళా-సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం టెంట్ సిటీ, తాగునీరు, పారిశుద్ధ్యం, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ ఏర్పాటు చేశారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది.

సంబంధిత పోస్ట్