ఫేక్ డైలాగ్స్‌పై పుష్ప-2 టీమ్ సీరియస్ అయింది. "ఊహాజనితమైన, సొంత క్రియేటివిటీతో సృష్టించిన కొన్ని డైలాగులు ‘పుష్ప 2’ చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కావాలనే కొందరు సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి ఆపకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం." అని పేర్కొంది. పుష్ప-2 పైరసీ వీడియోలు, లింక్స్ కనిపిస్తే వెంటనే ఈ నంబరుకు 8978650014 వాట్సాప్ చేయమని టీమ్ విజ్ఞప్తి చేసింది.