ఐకాన్ స్టర్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప- 2’ తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించింది. హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా నిలిచింది. రూ.632 కోట్లు కలెక్ట్‌చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.