హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి వస్తున్నాయని, కళ్లు తెరుస్తున్నప్పటికీ ఎవరినీ గుర్తు పట్టడం లేదని తెలిపారు.