పుష్ప-2 సినిమా టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా కొన్ని థియేటర్లు బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచేశాయి. ముంబయిలోని ఓ థియేటర్‌లో అయితే టికెట్‌ను ఏకంగా రూ.3వేలకు విక్రయిస్తున్నారు. జియో వరల్డ్‌డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్ మైసన్‌లో టికెట్ ధర ఏకంగా రూ.3వేలు చూపిస్తోంది. అయితే ఆ థియేటర్‌లో వీఐపీ తరహాలో సౌకర్యాలు ఉండటంతో టికెట్ ధర ఇంత భారీగా పెట్టినట్లు సమాచారం.