రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ అంతే.. మనుషులను చంపుతూ పోతాడంటూ వ్యాఖ్యానించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. కాగా ఇటీవల ట్రంప్-పుతిన ఫోన్‌కాల్‌లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధవిరమణ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అసహనంతో ఉన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.