‘ఇండియన్ ఐడల్’ సీజన్ 9 ఫైనలిస్ట్‌గా దేశవ్యాప్త గుర్తింపు సాధించిన హైదరాబాద్ గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్, తన స్వర మాయాజాలంతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. తను సొంతంగా రూపొందించిన కొత్త పాట ‘పోరగ పోరగ’ మే 1, 2025న విడుదల కానుంది. ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’తో ఎందరో మనసులు గెలిచిన రోహిత్, ఈసారి కర్ణాటిక్, హిప్-హాప్ శైలుల కలయిక తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. చిన్న వయస్సు నుంచే సంగీతం పై ఇష్టం పెంచుకున్న ఆయన , ‘చిట్టి కుడియే’ (‘ప్రేమలు’) వంటి పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ‘పోరగ పోరగ’ పాట యువత హృదయాలను ఆకర్షించే భావంతో రూపొందినట్లు రోహిత్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో రోహిత్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. భారతదేశంలోని అన్ని భాషల్లో పాటలు పాడాలని ఆయన కలలు కంటున్నారు. ఈ కొత్త పాట సంగీత ప్రేమికులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది.