TG: ప్రభుత్వ స్కూళ్లలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని CM రేవంత్ ఆదేశించారు. ICCCలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 'బోధన ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవావాలి. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. హైస్కూల్ స్థాయి నుంచే నైపుణ్యాభివృద్ధి కల్పించాలి' అని సూచించారు.