నాణ్యమైన విద్యుత్‌ అందించాలి: CM రేవంత్

53చూసినవారు
నాణ్యమైన విద్యుత్‌ అందించాలి: CM రేవంత్
తెలంగాణ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు విద్యుత్‌ శాఖపై శుక్రవారం సీఎం సమీక్ష చేపట్టారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేశారు. GHMCలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు చూడాలని.. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్