బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఉద్యమాన్ని అణచివేయాలని నిశ్చయించింది. అరెస్టులు, జరిమానాలు, ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, లాఠీఛార్జీలు, నిరాయుధులపై కాల్పులు జరపడం ఈ ఉద్యమకాలంలో నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ హింసాకాండ తారస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కాల్పుల్లో మరణించగా, 60 వేలకు పైగా అరెస్టయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడంతో పరిసమాప్తమైంది.