బంగ్లాదేశ్‌లో నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై ఓ మూక దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించింది. దీంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. సిరాజ్‌గంజ్ జిల్లాలోని ఠాగూర్ పూర్వీకుల నివాసం సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తిని మ్యూజియం సిబ్బంది నిర్బంధించి, దాడి చేయడంతో స్థానికులు ఆగ్రహించి మ్యూజియం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఓ మూక మ్యూజియం ఆడిటోరియంపై దాడి చేసి, దాన్ని ధ్వంసం చేసింది.