మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరమని 'X' వేదికగా BRS స్పందించింది. 'రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంకా గాంధీ.. మీ పార్టీ నేతల మాటలు వినండి. వాళ్లు మహిళలు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పబ్లిక్ లోకి లాగుతున్నారు. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. అనాలోచిత వ్యాఖ్యలతో మీ పార్టీకి సమాధి తవ్వుతున్నారు' అని ట్వీట్ చేసింది.