కులగణనపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని అన్నారు. కాంగ్రెస్ హామీలు, వాగ్దానాలు, ప్రకటనలన్నీ రాజకీయ ప్రయోజనాలకోసమే తప్ప, మరేమీ కాదని అన్నారు. రాహుల్ గాంధీ.. మీరు మీ పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని కేటీఆర్ ట్విట్టర్ విమర్శించారు.