ప్రధాని మోదీకి రాహుల్ వీడియో సందేశం

82చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌ను సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు. ఆ రాష్ట్ర ప్రజల వేదన వినాలని ప్రధానికి సూచించారు. దీనికి సంబంధించిన 5 నిమిషాలు నిడివి గల ఓ వీడియోను గురువారం రాహుల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మణిపూర్ రాష్ట్రం రెండుగా విభజితమైందన్నారు. ఘర్షణలు అనంతరం ఆ రాష్ట్రానికి తాను మూడోసారి వెళ్లానన్నారు. నాటికి నేటికి ఆ రాష్ట్రంలో పరిస్థితుల్లో ఏటువంటి మార్పు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్