ఎడ్జ్‌బాస్టన్‌లో వర్షం కురుస్తోంది. దీంతో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ నిలిచిపోయింది. గ్రౌండ్ సిబ్బంది మైదానం మొత్తం కవర్లు కప్పారు. వర్షం ఇలాగే కొనసాగితే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా చివరిరోజు ఇంగ్లాండ్ 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. అలాగే టీమ్ ఇండియా విజయానికి మరో 7 వికెట్లు అవసరం. రోజంతా వర్షం ఇలాగే కొనసాగితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది.