TG: హైదరాబాద్ నగరంలో బుధవారం సా. 6:30 నుంచి 9:00 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని, గంటకు 30-40KM వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే నగరంలో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో.. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.