సిలికాన్ వ్యాలీలో ఆఫ్ ఇండియా బెంగళూరులో మంగళవారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. ఈ భారీ వర్షానికి వైట్ ఫీల్డ్, బ్రూక్ ఫీల్డ్, మహదేవపుర సహా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారుల్ని ముంచేశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. బెంగళూరును "స్మార్ట్ అండర్ వాటర్ సిటీ"గా మారకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.