బుడమేరులో శవమై తేలిన రియల్ ఏస్టేట్ వ్యాపారి (వీడియో)
రెండు రోజుల క్రితం గన్నవరం-కేసరపల్లి మార్గంలో కారుతో సహా గల్లంతైన రియల్ ఏస్టేట్ వ్యాపారి ఫణి కుమార్ మృతదేహం లభ్యమైంది. బుడమేరులో అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కారు మునిగిన దగ్గరలో చెట్లకు చిక్కుకుని అతని మృతదేహం కనిపించింది. ఫణి మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, వినాయక చవితి సందర్భంగా ఫణి హైదరాబాద్ నుంచి తన స్వగ్రామం మచిలీపట్నం మండలం హుస్సేన్ పాలేంకు వచ్చాడు. బుడమేరు వాగు దాటుతుండగా కారుతో సహా వరదలో కొట్టుకుపోయాడు.