అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు తీరని నష్టాన్ని కలిగిస్తోంది. కార్చిచ్చు ప్రభావంతో వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కాలి బూడిదై పోతున్నాయి. కాగా, కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లో తొలి వర్షం కురిసింది. కొత్తగా మంటలు చెలరేగకుండా ఇది దోహదం చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. శనివారం రాత్రి స్వల్ప మోతాదులో వర్షం మొదలుకాగా.. మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.