వర్షానికి తడిసిన వడ్లు.. బోరున ఏడ్చిన రైతు దంపతులు (వీడియో)

66చూసినవారు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ 18 ఎకరాల్లో సాగు చేసిన వడ్లను 20 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పాటు వచ్చిన అకాల వర్షానికి వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతు దంపతులు బోరున ఏడుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సంబంధిత పోస్ట్