IPL పునఃప్రారంభానికి వాన గండం పొంచి ఉంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన IPL తిరిగి 9 రోజుల అనంతరం ప్రారంభం కానుంది. శనివారం రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.