తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

0చూసినవారు
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పొలాల్లో రైతులు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్