TG: రానున్న 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పటాన్‌చెరు, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, హఫీజ్‌పేట్, గచ్చిబౌలిలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇంకా కూకట్‌పల్లి, మాదాపూర్, జేఎన్‌టీయూ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.