తెలంగాణలో మొదలైన వర్షం

67చూసినవారు
తెలంగాణలో మొదలైన వర్షం
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో అర్ధరాత్రి వర్షం కురవగా HYDలో బుధవారం తెల్లవారుజాము నుంచి జల్లులు మొదలయ్యాయి. ఇవాళ ములుగు, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్