TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సీఎల్పీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 'ఎమ్మెల్యేలను, మంత్రులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు అందరికీ అన్నీ ఇస్తాం అని ఎందుకు చెప్తున్నారు. రైతుభరోసా పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడంతో గ్రామాల్లో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు' అని ప్రశ్నించినట్లు సమాచారం.