రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న 'రాజాసాబ్' టీజర్ రేపు ఉదయం 10.52గం.లకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ “ది వెయిట్ ఈజ్ ఓవర్.. లోడింగ్” అంటూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. దీనితో పాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ లుక్ పోస్టర్లు షేర్ చేయడంతో టీజర్‌పై హైప్ మరింత పెరిగింది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.