అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి రమేశ్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జోగి రమేశ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం రాజీవ్‌ను అదుపులోకి తీసుకుని గొల్లపూడి కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన్ను విచారిస్తున్నారు.