రాజీవ్ యువ వికాసం.. దరఖాస్తుల గందరగోళం!

64చూసినవారు
రాజీవ్ యువ వికాసం.. దరఖాస్తుల గందరగోళం!
TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. మొదట దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఇవ్వాలని చెప్పి.. ఆ తర్వాత మాన్యువల్‌గా ఇవ్వాలని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు, పత్రాలు సమర్పించాక.. తహసీల్దార్ కార్యాలయం నుండి ఫోన్ చేసి మరొకసారి దరఖాస్తులు ఇవ్వమని చెప్తున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్