TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం అమలు చేస్తోంది. అయితే జూన్2న లబ్ధిదారులకు మంజూరు ప్రతాలు ఇస్తామని ప్రకటించినా.. అదికాస్త వాయిదా పడింది. కాగా ఈ పథకానికి వివిధ కార్పొరేషన్ల వారీగా 16,23,643 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో అధికారుల పరిశీలనలో కొన్ని, బ్యాంకర్లు సిబిల్ స్కోరు, లావాదేవీల ఆధారంగా మరికొన్ని పేర్లను తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 6,60,332 దరఖాస్తులు రిజెక్ట్ అయినట్లు సమాచారం.