TG: రాజీవ్ యువ వికాసం పథకం కింద మొదటి విడతగా రూ.లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాల జారీ చేస్తామని ప్రకటించినా.. చివరికి వాయిదా పడింది. అయితే అర్హుల ఎంపికలో భాగంగా భారీగా దరఖాస్తులు రిజెక్ట్ చేయడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని అమలు చేయాలని తొలుత అనుకున్నా, ఇప్పుడు ఎన్నికలు అయ్యాక అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.