TG: రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకం అమలవుతోంది. కార్పొరేషన్ల ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రాయితీ రుణాలు అందిస్తారు. రాష్ట్రంలోని యువతకు స్వయంగా ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాస్ పథకం కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.