రూ.8 వేల కోట్లతో ‘రాజీవ్ యువ వికాసం’ పథకం: డిప్యూటీ సీఎం భట్టి

3చూసినవారు
రూ.8 వేల కోట్లతో ‘రాజీవ్ యువ వికాసం’ పథకం: డిప్యూటీ సీఎం భట్టి
TG: ఖమ్మం జిల్లా మధిరలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.8 వేల కోట్లతో ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష కోట్లతో రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్