రాజీవ్‌ యువవికాసం.. దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర సమస్యలు

56చూసినవారు
రాజీవ్‌ యువవికాసం.. దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర సమస్యలు
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ఇంటర్నెట్, మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అప్లికేషన్ చివరి దశలో సర్వర్ మొరాయించి.. దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ కావడం లేదు. మళ్లీ అప్లై చేస్తే "ఆల్రెడీ అప్లైడ్" అని వస్తుందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏప్రిల్ 14తో దరఖాస్తుల గడువు ముగియనుంది.

సంబంధిత పోస్ట్