టాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ కలిసి సినిమా చేయనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. UV క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుందని టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా పూర్తి చేసుకుంటున్నారు. తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ, ప్రభాస్‌తో స్పిరిట్ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా-చరణ్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.