AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పీఎస్ కు చేరుకున్నారు. చంద్రబాబు పవన్, లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఆయనపై 2024 మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీని 50 ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది.