వనజీవి రామయ్య మృతి దురదృష్టకరం, బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ రామయ్య కోటి మొక్కలు నాటారని చెప్పారు. ఆయనకు చిరకాల కోరికలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌తో చర్చించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటిని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.