HYDలోని మాధాపూర్‌లోని వరద ముప్పు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. నాలాల్లో వరద సాఫీగా సాగుతుందా? లేదా? ఎక్కడైనా ఆటంకాలున్నాయా? అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాలలో వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై GHMC, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు. దుర్గం చెరువుకు నీటి నిలువల స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు.